యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర / Biography of Yusuf (Alaihissalam).

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర / Biography of Yusuf (Alaihissalam).

2024-09-13T17:37:47

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర / Biography of Yusuf (Alaihissalam). యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర / Biography of Yusuf (Alaihissalam).

విశ్వాసం విధేయతను కోరుతుంది

విశ్వాసం విధేయతను కోరుతుంది

2024-09-09T16:41:16

ఉపవాసం అంటే, అల్లాహ్‌ మీద విశ్వాసంతో, అల్లాహ్‌ ప్రసన్నత కోసం, పుణ్యఫలాపేక్షతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు, అసభ్య ప్రవర్తనలకు, అసత్య, అశ్లీల సంభాషణల కు, భార్యాభర్తలయితే లైంగిక వాంఛలకు దూరంగా ఉండటం.

లక్ష్య సిద్ధి దిశగా అడుగులు సాగాలి!

లక్ష్య సిద్ధి దిశగా అడుగులు సాగాలి!

2024-09-09T16:41:15

రమజాను మాసాన్ని పొందిన సుభక్తా జనులందరికి శుభాకాంక్షలు! ‘ఈ మాసపు ఉపవాసాలను అల్లాహ్‌ విధిగావించాడు. ఈ మాసంలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి. నరక ద్వారాలు మూసివేయబడతాయి. దుష్ట షైతానులను బంధించడం జరుగుతుంది. ఈ

ముఖ్య సూచనలు

ముఖ్య సూచనలు

2024-09-09T16:41:14

కువైట్‌లో నీకు స్వాగతం సోదరా! ఈ చిరు పుస్తకంలో నీ పనిని మరింత సులభతరం చేసే ముఖ్య సూచనలున్నాయి. వీటి ద్వారా నువ్వు నీ పనిని సమర్థవంతంగా నిర్వర్తించగలవన్నది మా ఆశ. ఈ సూచనల ఆధారంగా నువ్వు కువైట్‌ సమాజంలో త్వరగా కలిసి పోగలవడంతోపాటు ఇక్కడి ఆచారవ్యవహారాలను బాగా అర్థం చేసుకోగలవన్న నమగ్మకమూ మాకుంది. అనుక్షణం నీ మేలు కోరే ఆప్తుల మధ్య నివసిస్తున్నా నన్న గొప్ప అనుభూతి నీకు కలుగుతుంది.

దానవుణ్ణి  జయించిన మానవుడు

దానవుణ్ణి జయించిన మానవుడు

2024-09-09T16:41:13

విశ్వం వెలుగునీడల కలయిక. పెనుగులాడుతుంటాడు మనిషి ఇది తెలియక. అడుగు నేలపై ఆనని యౌవనం అడుసులోకి దిగబడుతుందని గహ్రించక పడతాడు తికమక. నిత్యం దీప్తమని అనుకున్న జీవితం లిప్తలో ఆరిపోతుందని ఎరుగక కకావికలుడవుతాడు మనిషి.

ఓ మనిషీ! నిన్ను నువ్వు తెలుసుకో

ఓ మనిషీ! నిన్ను నువ్వు తెలుసుకో

2024-09-09T16:41:12

ఈ మీ జీవితం అత్యంత సుదీర్ఘమైనది, నిరంతరాయమైనది. మరణం ఈ జీవి తానికి ఆఖరి అంచు కాదు. పైగా అది మరో యుగానికి – నవ యుగానికి నాంది. మరో మాటలో చెప్పాలంటే మృత్యువు జీవిత థల మధ్య ఒక విభ జన రేఖ వంటిది. ఉదాహరణకు ఒక రైతు చేనులో నారు వేస్తాడు. నీరు పెడ తాడు. పంట కోసం పెట్టుబడి పెడతాడు. అది పండే వరకూ శ్రమిస్తాడు. పంట పండిన తర్వాత కోత కోస్తాడు. ఎందుకు? పంటను నూర్చి ఏడాది వరకూ తనకు కావలసిన ఆహారధాన్యాన్ని సమకూర్చు కునేందుకు! పంట కోతకు వచ్చిందంటే, దాని అర్థం ఒక థ ముగిసింది. రెండవ థకు లేక రెండవ యుగానికి ఆ కోత నాంది అయింది.

సుహృద్భావం సామరస్యానికి పునాది

సుహృద్భావం సామరస్యానికి పునాది

2024-09-09T16:41:11

ప్రజలు సహజంగా శాంతికాముకులు. వారు శాంతిని, మనశ్శాంతిని, ద్వేషరహిత, అణ్వస్త్ర రహిత శాంతినే కోరుకుంటారు. అందుకే శాంతి అనేది మనుజ జాతి మనుగడతో ముడిపడి ఉన్న అవిభాజ్యాంశం అయింది నాటి నుంటి నేటి వరకు. తగాదాలను చిలికి, చిలికి గాలి వానగా చేసుకొని పరస్పర విధ్వంసానికి దారి తీసే పశు ప్రవృత్తిని శాంత స్వభావులు ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి సుహృద్భావాన్ని పెంపొందించి సామరస్యాన్ని సాధించుకునే దిశగా మనిషి పురోగమించాలి.

హలాల్‌ సంపాదన వికసిస్తుందిహరామ్‌ సంపాదన కుంచించుకుపోతుంది

హలాల్‌ సంపాదన వికసిస్తుందిహరామ్‌ సంపాదన కుంచించుకుపోతుంది

2024-09-09T16:41:10

ధనం మనిషికి ఒక అవసరం. దాని కోసం ప్రతి మానవుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ధనం సంపాదించటానికి ప్రపంచంలో ఎన్నో మార్గాలున్నాయి. అందులో కొన్ని అధర్మమైనవీ, కొన్ని సక్రమ మైనవైతే, కొన్ని అక్రమమైనవని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి మనిషి ధన సంపాదన కొరకై అవలంబిస్తున్న మార్గం ధర్మ సమ్మతమైనదా లేక అధర్మమైనదా? అని ఆలోచించాలి. ఎందుకంటే మనందరినీ సృష్టించిన దేవుడు అక్రమ మార్గాల్లో ధనం సంపాదించ టాన్ని నిషేధించాడు. ధర్మసమ్మతమైన మార్గాన్నే అవలంబించాలని ఆదేశించాడు.

విజన్‌…!

విజన్‌…!

2024-09-09T16:41:09

మానవుడు పుడమిపై పాదం మోపిన నాటి నుంచి నేటి వరకూ – సర్వకాల సర్వావస్థల్లో- తన భవిష్యత్తుపై ‘కలలు’ కంటూనే ఉన్నాడు. నేటి గ్లోబలైజేషన్‌ యుగంలో ఈ విజన్‌ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక సగటు మనిషి మొదలుకుని సూపర్‌మాన్‌ వరకు, చిట్టిపొట్టి ప్రాంతీయ సంస్థల నుండి జాతీయ అంతర్జాతీయ సంస్థల వరకూ – ప్రతి ఒక్కరూ అందమైన, ఉజ్వలమైన భవిష్యత్తును దర్శిస్తున్నారు. బ్లాక్‌ బోర్డు నుండి పవర్‌ పాయింటుల వరకూ అందుబాటులో ఉన్న ప్రతి ప్రచార, ప్రసార సాధనం ద్వారా తమ కలల ప్రపంచాన్ని చూపించి, అనుచర గణాన్ని తన్మయుల్ని చేస్తున్నారు.

ఒక మనిషి రెండు వైఖరులు

ఒక మనిషి రెండు వైఖరులు

2024-09-09T16:41:08

అవనిపై ఓ అపరిచిత ప్రాంతంలో కళ్ళు తెరిచిన ఈ మానవుడు బాల్యం, కౌమార థల్ని దాటుకుంటూ నిండు యౌవనస్థుడై నిలుస్తాడు. విద్యాక్రీడ విన్యాసాలతో, జ్ఞానసాగర జలకాలాటలతో విజ్ఞుడవుతాడు. ప్రకృతి రీత్యా తనకు ప్రాప్తమైన ప్రతిభా పాటవాలను పదును పెట్టి ప్రగతి పథంలో జీవన రథాన్ని నడిపించి అనూహ్య విజయాల్ని సాధిస్తాడు. ఒక పట్టున క్రాంతికారుడిగా, వేరొక తట్టున కారుణ్య మూర్తిగా, తృటిలో వక్తగా, ప్రవక్తగా పద మాలికలను ముత్యాల హారంగా పొదిగి, మాటల మల్లియలతో గుభాళించె మల్లెల పందిళ్ళు వేస్తాడు. సత్య స్ఫూర్తినీ, పరలోక చింతనను కలబోసి మానవతకే వన్నె తెస్తాడు.

సంఘ సంస్కరణ రణ పండితాగ్రేసరులు ముహమ్మద్‌ (స)

సంఘ సంస్కరణ రణ పండితాగ్రేసరులు ముహమ్మద్‌ (స)

2024-09-09T16:41:07

ప్రపంచంలో ఎందరో మహాపురుషులు, దైవప్రవక్తలు ఉద్భవించి లోక కల్యాణం కోసం తమ వంతు కృషి చేశారు. అయితే ప్రవక్తలకు, ప్రవక్తేతరులకు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రవక్తేతరులయిన మహా పురుషులు సహజసిద్ధంగా తమకున్న జ్ఞానం, శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రమే పని చేశారు, చేస్తున్నారు. కాని దైవప్రవక్తలు తమకున్న జ్ఞానం, శక్తి సామర్థ్యాలను సృష్టికర్త నుండి లభించే దివ్యజ్ఞానం ప్రకారం వినియోగిస్తూ లోక కల్యాణం కోసం పనిచేస్తారు. దైవప్రవక్త లకు ఈ జ్ఞానం సందర్భానుసారం దివ్యావిష్కృతి (వహీ) ద్వారా కొద్ది కొద్దిగా లభిస్తుంది.

విధిరాత నియమాలు-6

విధిరాత నియమాలు-6

2024-09-09T16:41:06

సకల సృష్టికి మూలాధారం అల్లాహ్‌యే. ఆయన తన యుక్తినీ, ప్రణాళికను గురించి తన సృష్టితాలలో ఎవరికేది అవసరమో తగు మోతాదులో నిర్థారించాడు. ప్రతి వస్తువు విధి వ్రాతను ముందే చేశాడు. ప్రవక్త ఈసా (అ) ఇలా హితవు పలికారు: ”అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి యైనను,ఏమి ధరించుకొనుమో అని మీ దేహ మును గూర్చియైనను చింతింపకుడి; ఆహార ముకంటే వస్త్రముకంటే దేహమును గొప్పవి కాదా?!

ఇస్లాం వలన ఉపయోగమేమి?

ఇస్లాం వలన ఉపయోగమేమి?

2024-09-09T16:41:05

”మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి ఒకరికంటే ఒకరు ముందుకు పోయే కృషి చేయండి; ఆకాశాలంత, భూమియంత విశాల మైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహ్‌నూ ఆయన ప్రవక్తలనూ విశ్వసించిన వారి కొరకు సిద్ధం చేయబడింది.ఇది అల్లాహ్‌ అనుగ్రహం; తాను కోరిన వారి కొరకు దాని ని ప్రసాదిస్తాడు. అల్లాహ్‌ా ఎంతో అనుగ్రహం కలవాడు.” (ఖుర్‌ఆన్‌ 57:21)

పెళ్ళి కొరకు  నిషేధించబడిన స్త్రీలు

పెళ్ళి కొరకు నిషేధించబడిన స్త్రీలు

2024-09-09T16:41:04

వైద్యశాస్త్రం కూడా మేనరికం చెయ్యరాదని (అంటే అక్క కుమార్తెను వివాహం) చేసుకో వటం వలన అనేక సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ లో 1400 సంవత్సరాలకు పూర్వమే చెప్ప బడింది. ఇప్పుడు శాస్త్రీయపరంగా పరిశీలి ద్దాం. క్రీ.శ. 1665 సంవత్సరంలో రాబర్ట్‌ హుక్‌ అను శాస్త్రజ్ఞుడు జీవరాశుల శరీరము అనేక గ్రంధులు వంటి కణములతో నిర్మింప బడి ఉంటాయని కనుకొన్నాడు.

పుస్తకం మస్తకం

పుస్తకం మస్తకం

2024-09-09T16:41:03

పుస్తకం అన్నది రెండు అట్టల మధ్య కుట్టిన కొన్ని కాగితాల బొత్తిగా భౌతికంగా మనకు కనబడవచ్చు. కానీ, నిజంగా పుస్తకం ఆంటే మనిషి మస్తకం. మనిషి పొందగలిగిన సకల అనుభవాలు,ఎదుర్కో గలిగే సకల సమస్యలు, ఎదురు నిలిచే సకల చిక్కుముడులు, మనిషిని ఊపేయగలిగే సకల ఉద్వేగాలు-అన్నీ పుస్తకం లో నిక్షిప్తమయి ఉంటాయి. యావత్తు నాగరిక ప్రపంచం ఒక ఎత్తు; పుస్తకం మరో ఎత్తు. ఆధునిక ప్రపంచం మొత్తాన్ని పుస్తకాల ద్వారా పునర్నిర్మించవచ్చు!

మరింత ప్రేమనివ్వండి మరింత సమయమివ్వండి

మరింత ప్రేమనివ్వండి మరింత సమయమివ్వండి

2024-09-09T16:41:02

మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మనం చేపట్టే ఏ పనికయినా అవి రళ కృషి, అవిశాంత పరిశమ్ర, గట్టి పట్టుదల అవసరం. మన ఇంట ఒక మొగ్గ విర బూసిం దంటే, మనం తల్లిదండుల్రుగా అప్పుడే జన్మించామని అర్థం. మన తోటలో మనం వేసిన ఆ విత్తనం మొలకయి, మహా వృక్షాన్ని సృజించగలగాలంటే, ఆ మహా వృక్షంలోని ఒక్కొక్క కొమ్మ, ఒక్కొక్క రెమ్మ, ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క ఫలం నుండి మానవత్వపు అమృతం జాలువారాలంటే – మనం నిరంతరం మారుతూ, నేర్చుకుంటూ ఉండాలి. చేయదగిన పనులేవో, చేయకూడని పనులేవో, ఉచిత నిర్ణయాలేవో, అనుచిత నిర్ణయాలేవో వారికి అర్థమయ్యేలా బోధించాలి.

రాజో ఋతువు రమజాన్‌

రాజో ఋతువు రమజాన్‌

2024-09-09T16:41:01

ఇంతటి పుణ్యప్రదమైన మాసం ఒంటరిగా రాదు. అచ్చమైన దైవానుగ్రహాల్ని, స్వచ్ఛమైన దివ్యగ్రంథ పారాయణాల్ని, వేయి నెలలకన్నా ఘనతరంగా నిలిచే పండు వెన్నెల్ని వెంట బెట్టుకొస్తుంది. సుభక్తాగ్రేసరుల భక్తీప్రత్తులకు, విశ్వంలోని విశ్వాసుల సంస్కృతీ సంప్రదాయాలకు, వారి మధ్య గల సఖ్య తకు, ఐక్యతకు ఆలంబనగా నిలుస్తుంది రమజాన్‌.

ఓ మానవుడా!

ఓ మానవుడా!

2024-09-09T16:41:00

పరమ దాత ఆయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే ఒక రేతస్సు బిందువుతో నిన్ను సృష్టించాడు. ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు. తాను తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలచాడు. ఆయనే నీకు చూడటానికి రెండు కళ్ళూ ప్రసాదించాడు. మాట్లాడటానికి ఒక నాలుకా, రెండు పెదవులూ అనుగ్రహించాడు. ఆయనే నిన్ను వినేవాడుగా చేశాడు. ఆయనే నీలో ఆలోచించే, అర్థం చేసుకునే మనస్సు కూడా ఇచ్చాడు. కాని నీవు ఆయన మేళ్ళను మరచి కృతఘ్నుడుగా మారావు.

మంచికి మారు పేరు ఇస్లాం

మంచికి మారు పేరు ఇస్లాం

2024-09-09T16:40:59

నీ ప్రభువు నిర్ణయం చేసేశాడు, మీరు కేవలం అయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి, తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి, ఒకవేళ మీవద్ద వారిలో ఒకరుగానీ, ఇద్దరుగానీ ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ‘ఉఫ్‌’ (ఛీ) అని కూడా అనకండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్ధిస్తూ ఉండండి; ప్రభూ! వారిపై కరుణ జూపు- బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు”. (ఖుర్‌ఆన్-17: 23,24)

నైతిక విలువల్ని నిలుపండి…!

నైతిక విలువల్ని నిలుపండి…!

2024-09-09T16:40:58

రాకెట్టు వేగంతో దూసుకుపోతున్న ప్రగతి, త్వర త్వరగా మారుతున్న పరిస్థితులలో మానవ సమాజం రకరకాల సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. ఒనరులు పెరుగుతున్నా, ఓనమాలు నేర్చుకునేవారు అధికమవుతున్నా సామాజిక రుగ్మతలు, సంఘంలోని అసాంఘీక కార్యకలాపాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఇంటిలోనూ ఈనాడు పెద్దలకు, పిల్లలకూ మధ్య అవగాహనా లోపం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. నైతిక విలువలలో మనం ఇముడ్చుకోలేనన్ని మార్పులు పొడ సూపు తున్నాయి. వెనుకటి తరాల వారికి ఎదురవని అనేక సమస్యలు ఈనాడు మనకు ఎదురవుతున్నాయి. పరస్పరం నిందా రోపణలు, కక్షలు, కార్పణ్యాలు పెచ్చు పెరిగి పోతున్నాయి.